ఎన్నికల్లో రాజకీయ పార్టీల వ్యయానికి పరిమితి విధించాలన్న పిటిషన్‌ తిరస్కరణ

రాజకీయ పార్టీలు ఎన్నికల్లో చేసే వ్యయానికి పరిమితి విధించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

Published : 09 Dec 2023 05:18 IST

విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు

దిల్లీ: రాజకీయ పార్టీలు ఎన్నికల్లో చేసే వ్యయానికి పరిమితి విధించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇది పార్లమెంటు, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల పరిధిలోకి వచ్చే అంశమని, తాము జోక్యం చేసుకోలేమని ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం స్పష్టం చేసింది. జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్ర ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యయాన్ని లెక్కించే విధానంలోనూ, రాజకీయ పార్టీల ర్యాలీల ఖర్చు మదింపులోనూ మార్పులు తీసుకురావాలని పిటిషనర్‌ కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని