గుజరాత్‌లో ఏడాదిన్నరగా నకిలీ టోల్‌ప్లాజా

గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో ఘరానామోసం ఆలస్యంగా బయటపడింది. మోర్బీ, కచ్‌ జిల్లాలను కలిపే 8ఏ నంబరు జాతీయ రహదారిపై వాఘసియా టోల్‌ప్లాజా ఉంది.

Updated : 09 Dec 2023 05:20 IST

 రూ.75 కోట్ల వసూళ్లు!

గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో ఘరానామోసం ఆలస్యంగా బయటపడింది. మోర్బీ, కచ్‌ జిల్లాలను కలిపే 8ఏ నంబరు జాతీయ రహదారిపై వాఘసియా టోల్‌ప్లాజా ఉంది. ఈ టోల్‌ప్లాజాను తప్పించుకునేందుకు కొందరు వాహనదారులు పక్కనున్న ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్తుండేవారు. దీన్ని గమనించిన మోసగాళ్లు.. ఆ మార్గంలో నిరుపయోగంగా ఉన్న ఓ సిరామిక్‌ ఫ్యాక్టరీని అద్దెకు తీసుకొని టోల్‌ప్లాజాగా మార్చేశారు. దానికి ఇరువైపులా హైవే వరకు బైపాస్‌ రోడ్డు నిర్మించారు. హైవేపై ఉన్న టోల్‌ప్లాజా ఛార్జీల కంటే తక్కువగా వసూలు చేస్తుండటంతో వాహనదారులు దీనిపై ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల వచ్చిన మీడియా కథనాలతో ఈ నకిలీ టోల్‌ప్లాజా గుట్టు రట్టయింది. ఏడాదిన్నర కాలంలో దాదాపు రూ.75 కోట్లు అక్రమంగా వసూలుచేసినట్లు తేల్చారు. పోలీసులు అయిదుగురు నిందితులను అరెస్టు చేశారు. వారిలో ఒకరు ఆర్మీ రిటైర్డ్‌ ఉద్యోగి.. మరొకరు పాటిదార్‌ వర్గ ప్రముఖ నేత కుమారుడు. గుజరాత్‌లోని దాహోద్‌ జిల్లాలో ఇటీవల ఓ నకిలీ ప్రభుత్వ ఆఫీసు గుట్టు సైతం బయటపడింది. దాన్ని ఛేదించగా.. అలాంటివి మరో ఆరు ఉన్నట్లు తేలింది. ప్రభుత్వ ఆఫీసులంటూ ప్రజలను నమ్మించి రూ.18 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించారు. ఈ కేసులో ఓ రిటైర్డ్‌ ఐఏఎస్‌ సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని