మోదీకే అత్యధిక ప్రజామోదం

ప్రపంచంలోకెల్లా అత్యధిక ప్రజామోదం గల నేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి నిలిచారు.

Published : 09 Dec 2023 05:22 IST

దిల్లీ: ప్రపంచంలోకెల్లా అత్యధిక ప్రజామోదం గల నేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి నిలిచారు. దేశంలో ఆయన నాయకత్వాన్ని 76% ప్రజలు హర్షిస్తుండగా.. 18% మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. ‘మార్నింగ్‌ కన్సల్ట్‌’ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. మోదీ తర్వాతి స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్‌ మాన్యుయెల్‌ లోపెజ్‌ ఒబ్రేడర్‌ ఉన్నారు. ఆయన నాయకత్వాన్ని మెక్సికోలో 66% మంది ఆమోదిస్తుండగా.. 29% మంది వ్యతిరేకిస్తున్నారు. మార్నింగ్‌ కన్సల్ట్‌ సంస్థ దాదాపుగా ప్రతివారం ఈ తరహా సర్వే నిర్వహిస్తుంటుంది. జనామోదం విషయంలో ప్రధాని అగ్రస్థానంలో ఉండటంపై పలువురు భాజపా నేతలు హర్షం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని