Seerat Kaur Mann: అబద్ధాల మా నాన్న మళ్లీ తండ్రి కాబోతున్నారు

తన తండ్రి మూడోసారి తండ్రి కాబోతున్నారంటూ పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ కుమార్తె సీరత్‌ కౌర్‌ ఓ వీడియో విడుదల చేశారు. అందులో తండ్రిపై విమర్శల వర్షం కురిపిం చారు.

Updated : 11 Dec 2023 09:48 IST

పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ కుమార్తె వీడియో

తన తండ్రి మూడోసారి తండ్రి కాబోతున్నారంటూ పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ (Bhagwant Mann) కుమార్తె సీరత్‌ కౌర్‌ (Seerat Kaur Mann) ఓ వీడియో విడుదల చేశారు. అందులో తండ్రిపై విమర్శల వర్షం కురిపిం చారు. ‘‘మొదటి నుంచి నా తండ్రి అసత్యాలు చెబుతూనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. మా అమ్మను ఎమోషనల్‌గా బలహీనపరిచినట్లే, పంజాబ్‌ ప్రజలను బలహీన పరుస్తున్నారు. ఇప్పటికీ విధానసభకు, గురుద్వారా సాహెబ్‌కు కూడా మద్యం మత్తులోనే వెళ్తున్నారు. సొంత పిల్లలకే న్యాయం చేయలేని వ్యక్తి, రాష్ట్రానికి ఏం మంచి చేస్తారు?’’ అని అందులో విమర్శించారు. సీరత్‌ కౌర్‌ వీడియోను ఆమె తల్లి, భగవంత్‌ మాన్‌ మొదటి భార్య ఇందర్‌ప్రీత్‌ కౌర్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. మాజీ భర్తపై విమర్శల వర్షం గుప్పించారు.

ఈటీవీ భారత్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని