31 నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు!

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 31న ప్రారంభమై ఫిబ్రవరి 9 వరకు కొనసాగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు గురువారం వెల్లడించాయి.

Published : 12 Jan 2024 03:46 IST

దిల్లీ: పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 31న ప్రారంభమై ఫిబ్రవరి 9 వరకు కొనసాగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు గురువారం వెల్లడించాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చే చివరి పద్దు ఇది. తాత్కాలిక బడ్జెట్‌ అయినందున ఆకర్షణీయమైన ప్రకటనలు, విధానపరంగా కీలకమైన మార్పులు ఉండకపోవచ్చని ఇప్పటికే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సంకేతాలిచ్చారు. ఎన్నికల తర్వాత కొలువుదీరే కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను తీసుకొస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని