కుమార్తె పెళ్లిలో అతిథులకు హెల్మెట్లు పంచిన తండ్రి

తన కుమార్తె వివాహానికి హాజరైన అతిథులకు శిరస్త్రాణాలను బహుమతిగా పంపిణీ చేసి ఆశ్చర్యపరిచాడో తండ్రి. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా నగరంలో ముదాపర్‌ ప్రాంతానికి చెందిన సెడ్‌ యాదవ్‌ కుమార్తె నీలిమ వివాహం సోమవారం జరిగింది.

Updated : 07 Feb 2024 07:04 IST

కోర్బా (ఛత్తీస్‌గఢ్‌): తన కుమార్తె వివాహానికి హాజరైన అతిథులకు శిరస్త్రాణాలను బహుమతిగా పంపిణీ చేసి ఆశ్చర్యపరిచాడో తండ్రి. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా నగరంలో ముదాపర్‌ ప్రాంతానికి చెందిన సెడ్‌ యాదవ్‌ కుమార్తె నీలిమ వివాహం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా అతిథులకు యాదవ్‌ హెల్మెట్లు పంపిణీ చేశారు. అంతేకాదు.. ఆయన కుటుంబసభ్యులు హెల్మెట్లు ధరించి నృత్యాలు చేశారు. ఇదంతా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడానికే చేశామని యాదవ్‌ చెప్పుకొచ్చారు. జీవితం చాలా విలువైందని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని అతిథులను ఆయన కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని