జాతీయ భద్రతకు ప్రాధాన్యం

మిత్రదేశాలతో స్నేహ సంబంధాలు కొనసాగించడం, జాతీయ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం భారతదేశ విధానంలో ప్రధానమైనవి రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు.

Updated : 22 Feb 2024 05:26 IST

రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌
ప్రారంభమైన మిలాన్‌-2024

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: మిత్రదేశాలతో స్నేహ సంబంధాలు కొనసాగించడం, జాతీయ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం భారతదేశ విధానంలో ప్రధానమైనవి రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో ‘మిలాన్‌-2024’ కార్యక్రమాలను బుధవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం వివిధ దేశాల నౌకాదళ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘యుద్ధాలు, వివాదాలు లేకపోవడమే నిజమైన శాంతి. మిత్ర దేశాలకు సహకారం అందించడంలో భారత్‌ అన్ని రకాలుగా ముందుంటుంది. దేశ రక్షణలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదు. యుద్ధం, శాంతిభద్రతల పరిరక్షణలో సాయుధ దళాల పాత్ర కీలకం. స్నేహపూర్వక దేశాల మధ్య అవగాహన, సైనిక సహకారం పెంపొందించడానికి మిలాన్‌ విన్యాసాలు ఎంతగానో ఉపయోగపడతాయి. హిందూ మహాసముద్రంలో శాంతి పరిరక్షణకు మిత్రదేశాలతో కలిసి పని చేస్తాం’’ అని రాజ్‌నాథ్‌సింగ్‌ పేర్కొన్నారు. అనంతరం మిలాన్‌ సావనీర్‌ను ఆవిష్కరించారు. నెట్‌వర్క్‌ ఫర్‌ ఇన్ఫో షేరింగ్‌ (నిషార్‌) కమ్యూనికేషన్‌ టెర్మినల్‌, మారిటైం సాంకేతిక ప్రదర్శనను ప్రారంభించారు. నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌, తూర్పు నౌకాదళం అధిపతి అడ్మిరల్‌ రాజేష్‌ పెంధార్కర్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని