కేంద్ర బలగాల తరలింపు సాఫీగా జరిగేలా చూడండి

సార్వత్రిక ఎన్నికలు, పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్‌ల) తరలింపు సజావుగా సాగేలా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల రైల్వేబోర్డుకు లేఖ రాసింది.

Published : 22 Feb 2024 04:33 IST

రైల్వేబోర్డుకు ఈసీ లేఖ

దిల్లీ: సార్వత్రిక ఎన్నికలు, పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్‌ల) తరలింపు సజావుగా సాగేలా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల రైల్వేబోర్డుకు లేఖ రాసింది. గతంలో రైళ్లు ఆలస్యమైన దాఖలాలు ఉండడంతో ఈసారి అలా జరగకుండా చూడాలని కోరింది. కొన్ని నెలల వ్యవధిలో 3.4 లక్షల మందికిపైగా బలగాలను దేశంలో ఒకచోట నుంచి మరోచోటకు చేరవేయాల్సి ఉండడంతో 24 గంటలూ పనిచేసే కంట్రోల్‌ రూంను ఏర్పాటుచేసి పర్యవేక్షిస్తుండాలని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని