చేతులు వదిలి 112కి.మీ బైక్‌ డ్రైవింగ్‌.. 74ఏళ్ల వ్యాపారవేత్త విన్యాసాలు

అనుకున్నది సాధించాలంటే వయసుతో సంబంధం లేదని నిరూపించారు.. పంజాబ్‌కు చెందిన 74ఏళ్ల వ్యాపారవేత్త. హ్యాండిల్‌ పట్టుకోకుండా బైక్‌ను ఏకంగా 112.4కి.మీ నడిపి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నారు.

Updated : 22 Feb 2024 06:35 IST

ఇండియా వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు

అనుకున్నది సాధించాలంటే వయసుతో సంబంధం లేదని నిరూపించారు.. పంజాబ్‌కు చెందిన 74ఏళ్ల వ్యాపారవేత్త. హ్యాండిల్‌ పట్టుకోకుండా బైక్‌ను ఏకంగా 112.4కి.మీ నడిపి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నారు. తనకు 40 ఏళ్ల క్రితం నుంచి హ్యాండిల్‌ పట్టుకోకుండా బైక్‌ నడపాలనే కోరిక ఉందని ఫరీద్‌కోట్‌ జిల్లాకు చెందిన బల్వీందర్‌ సింగ్‌ తెలిపారు. చిన్నప్పటి నుంచి ఏదైనా భిన్నంగా చేయాలనే తపనతో ఉండేవాడినని, అందుకే బైక్‌పై స్టంట్స్‌ చేశానని వెల్లడించారు. ‘2023 నవంబరు 16న మఖూ నుంచి బఠిండా వరకు మోటార్‌సైకిల్‌పై 112.4 కి.మీ ప్రయాణించా. నాతో పాటు ఒక వ్యక్తి, అంబులెన్స్‌ కూడా ఉంది. బఠిండాలో ఓ గొయ్యి అడ్డు వచ్చింది. లేదంటే మరింత దూరం ప్రయాణించే వాణ్ని. భారత్‌లో ఇంత దూరం హ్యాండిల్‌ పట్టుకోకుండా బైక్‌ నడిపిన వ్యక్తిని నేనే. సాహస కృత్యాన్ని వీడియో తీసి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ వారికి పంపాను. తదుపరి లక్ష్యం 200 కిలోమీటర్ల దూరాన్ని ఛేదించడమే’నని బల్వీందర్‌ సింగ్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని