Kerala: ఆక్యుపంక్చర్‌ వైద్యం ద్వారా ఇంట్లోనే బిడ్డను కనాలని.. ప్రాణాలొదిలిన తల్లీబిడ్డ

ఆక్యుపంక్చర్‌ వైద్యం ద్వారా ఇంట్లోనే బిడ్డను కనాలని ప్రయత్నించిన ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.

Published : 22 Feb 2024 05:58 IST

ఆక్యుపంక్చర్‌ వైద్యం ద్వారా ఇంట్లోనే బిడ్డను కనాలని ప్రయత్నించిన ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. కేరళలోని తిరువనంతపురంలో 36 ఏళ్ల గర్భిణి షెమీరా బీవీ ఆక్యుపంక్చర్‌ వైద్యం ద్వారా బిడ్డకు జన్మనిచ్చేందుకు ప్రయత్నించింది. నొప్పులతో తీవ్ర రక్తస్రావమయ్యాక ఆస్పత్రిలో చేరగా తల్లీబిడ్డా మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. మృతురాలి భర్త నయాజ్‌ను అరెస్ట్‌ చేశారు. మంగళవారం జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. షెమీరా బీవీ కొన్నాళ్ల క్రితం 4వసారి గర్భం దాల్చారు. తొమ్మిది నెలల కాలంలో ఒక్కసారి కూడా వైద్యుడిని సంప్రదించలేదు. భర్తతో కలిసి ఆక్యుపంక్చర్‌ నిపుణుడి వద్ద వైద్యం చేయించుకునేది. వైద్యుడిని ఆమె సంప్రదించేందుకు నయాజ్‌ ఒప్పుకోలేదని, ఆశావర్కర్లను ఇంట్లోకి రానివ్వలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ‘సాధారణ కాన్పు కోసమే నయాజ్‌ పట్టుబట్టి, దాని సంబంధిత వీడియోలు యూట్యూబ్‌లో చూసేవాడు. షెమీరాను ఇరుగుపొరుగువారితో మాట్లాడేందుకు సైతం అనుమతించేవాడు కాదు. ఇంట్లో ఒంటరిగా ఉండమని నిర్బంధించేవాడు’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు