కథక్‌ నృత్యంతో గిన్నిస్‌ రికార్డ్‌

ఒకే సమయంలో 1,484 కళాకారులు మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో కథక్‌ నృత్యాన్ని ప్రదర్శించి గిన్నిస్‌ రికార్డును సాధించారు.

Published : 22 Feb 2024 04:45 IST

ఒకే సమయంలో 1,484 కళాకారులు మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో కథక్‌ నృత్యాన్ని ప్రదర్శించి గిన్నిస్‌ రికార్డును సాధించారు. మంగళవారం ప్రారంభమైన 50వ నాట్య ఉత్సవాల్లో వీరంతా కలిసి ‘రాగ బసంత్‌’ అనే పాటకు ఏకరూప దుస్తుల్లో 20 నిమిషాల పాటు కథక్‌ నృత్యం చేశారు. వారిలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారే కాకుండా విదేశీ కథక్‌ కళాకారులు కూడా ఉన్నారు. ఈ ప్రదర్శన కోసం దాదాపు నెల రోజుల నుంచి కళాకారులు వర్చువల్‌గా సాధన చేశారు. వీరిలో విద్యార్థులు తమ పరీక్షలకు సిద్ధమవుతూనే దీనిని కొనసాగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని