విదేశాల్లోనూ నీట్‌-యూజీ నిర్వహణ

వైద్యవిద్యలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ‘నీట్‌’ని మే 5న 14 విదేశీ నగరాల్లోనూ రాసుకునే అవకాశం ఉందని ‘జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ’ (ఎన్‌టీయే) బుధవారం ప్రకటించింది.

Published : 22 Feb 2024 04:40 IST

దిల్లీ: వైద్యవిద్యలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ‘నీట్‌’ని మే 5న 14 విదేశీ నగరాల్లోనూ రాసుకునే అవకాశం ఉందని ‘జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ’ (ఎన్‌టీయే) బుధవారం ప్రకటించింది. దేశం వెలుపల ఉన్నవారు ఈ పరీక్షను రాసే అవకాశం కల్పించాలని పలువురి నుంచి అభ్యర్థనలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దుబాయ్‌, షార్జా, అబుధాబీ (యూఏఈ); కువైట్‌ సిటీ (కువైట్‌), బ్యాంకాక్‌ (థాయిలాండ్‌), కొలంబో (శ్రీలంక), దోహా (ఖతార్‌), కాఠ్‌మాండూ (నేపాల్‌), కౌలాలంపూర్‌ (మలేసియా), లాగోస్‌ (నైజీరియా), మనామా (బహ్రెయిన్‌), మస్కట్‌ (ఒమన్‌), రియాద్‌ (సౌదీ అరేబియా)లతో పాటు సింగపూర్‌లోనూ పరీక్ష నిర్వహించనున్నారు. కరదీపికలో ఈ వివరాలు లేకపోవడం వల్ల మన దేశంలోని ఇతర కేంద్రాలను ఇప్పటికే ఎంచుకుని రుసుం చెల్లించినవారు ఈ దేశాల్లో ఎక్కడైనా పరీక్షకు హాజరుకావాలని అనుకుంటే ఆ మేరకు మార్పు చేసుకోవచ్చని ఎన్‌టీయే సీనియర్‌ డైరెక్టర్‌ సాధనా పరాశర్‌ తెలిపారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు ఉద్దేశించిన విండో మూతపడిన తర్వాత మార్పులకు అవకాశం లభిస్తుందని వివరించారు. ఈ పరీక్ష కోసం మన దేశంలో 554 కేంద్రాలను ఏర్పాటుచేశారు. దరఖాస్తుల సమర్పణకు మార్చి 9 వరకు గడువు ఉంది. పరీక్ష ఫలితాలు జూన్‌ 14న వెలువడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని