బైజూస్‌ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌ విదేశాలకు వెళ్లకుండా ఆంక్షలు

బైజూస్‌ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో బైజు రవీంద్రన్‌ దేశం విడిచి వెళ్లకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఆంక్షలు విధించింది.

Published : 23 Feb 2024 04:08 IST

దిల్లీ: బైజూస్‌ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో బైజు రవీంద్రన్‌ దేశం విడిచి వెళ్లకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఆంక్షలు విధించింది. ఏడాది క్రితమే జారీచేసిన లుకౌట్‌ సర్క్యులర్‌ (ఎల్‌సీ) స్థాయిని ఈ మేరకు పెంచింది. రవీంద్రన్‌ కదలికల గురించి ఇమ్మిగ్రేషన్‌ అధికారులు కేవలం సమాచారం ఇవ్వాలని తెలిపే ఎల్‌సీ ఇప్పటివరకు అమల్లో ఉంది. తాజా మార్పు ప్రకారం ఆయన మన దేశ భూభాగం నుంచి ఏ మార్గంలోనూ విదేశాలకు వెళ్లకుండా నిలువరించాల్సి ఉంటుంది. విదేశానికి వెళ్లకుండా పూర్తిగా అడ్డుకోవాలా, ప్రశ్నించిన తర్వాత కొన్ని హామీలు పొంది అనుమతించాలా అనేది దర్యాప్తు అధికారి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. రవీంద్రన్‌ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నట్లు సమాచారం. రూ.9,300 కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్య ఉల్లంఘనలకు పాల్పడినట్లు గత నవంబరులో ఈడీ అభియోగాలు మోపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని