ఆల్కహాల్‌ స్థాయినే కాదు.. వ్యాధులనూ నిర్ధారించొచ్చు!

శ్వాసను విశ్లేషించడం ద్వారా ఆల్కహాల్‌ స్థాయిని గుర్తించడంతో పాటు పలు వ్యాధులనూ నిర్ధారించగల సరికొత్త సెన్సర్‌ను రాజస్థాన్‌లోని ఐఐటీ జోధ్‌పుర్‌ పరిశోధకులు అభివృద్ధి చేశారు.

Updated : 23 Feb 2024 06:11 IST

శ్వాస విశ్లేషణకు సరికొత్త సెన్సర్‌

దిల్లీ: శ్వాసను విశ్లేషించడం ద్వారా ఆల్కహాల్‌ స్థాయిని గుర్తించడంతో పాటు పలు వ్యాధులనూ నిర్ధారించగల సరికొత్త సెన్సర్‌ను రాజస్థాన్‌లోని ఐఐటీ జోధ్‌పుర్‌ పరిశోధకులు అభివృద్ధి చేశారు. మానవ శ్వాస విశ్లేషణ కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతలు ఫ్యూయెల్‌ సెల్స్‌ ఆధారంగా పనిచేస్తున్నాయి. వాటి కంటే తక్కువ ఖర్చుతో శ్వాసను విశ్లేషించేందుకు లోహ ఆక్సైడ్‌లు, నానో సిలికాన్‌లను ఉపయోగించి పరిశోధకులు తాజా సాంకేతికతను రూపొందించారు. గది ఉష్ణోగ్రత వద్ద అది సమర్థంగా పనిచేయగలదు. దానితో సేకరించిన డేటాను మెషీన్‌ లెర్నింగ్‌ ఆల్గోరిథమ్‌లు విశ్లేషిస్తాయి. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షల్లో ఆల్కహాల్‌ స్థాయిని గుర్తిస్తాయి. ఆస్తమా, డయాబెటిక్‌ కీటోయాసిడోసిస్‌, క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మొనరీ డిసీజ్‌, గుండెపోటు స్లీప్‌ అప్నియా వంటి వ్యాధులనూ నిర్ధారిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు