మల్లికార్జున ఖర్గేకు ‘జడ్‌ ప్లస్‌’ భద్రత

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Published : 23 Feb 2024 04:44 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనకు అత్యున్నత స్థాయి జడ్‌ ప్లస్‌ భద్రత కల్పించినట్లు కేంద్ర హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. ఖర్గే భద్రతపై అందిన నివేదికను ఇటీవల సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక నుంచి నిరంతరంగా ఖర్గే భద్రత కోసం 30 మంది సీఆర్‌పీఎఫ్‌ కమాండోలు మూడు షిఫ్టుల్లో విధుల్లో ఉంటారు. దేశంలో ప్రముఖ వ్యక్తులకు పొంచి ఉన్న ముప్పు ఆధారంగా వారికి ఎక్స్‌, వై, వై ప్లస్‌, జెడ్‌, జెడ్‌ ప్లస్‌ స్థాయి భద్రతను కేంద్ర హోం శాఖ కల్పిస్తుంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు