4 దేశాలకు ఉల్లి ఎగుమతి.. కేంద్రం అనుమతి

దేశంలో ఉల్లి ఎగుమతులపై విధించిన నిషేధాన్ని పాక్షికంగా సడలిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్‌, మారిషస్‌, బహ్రెయిన్‌, భూటాన్‌ దేశాలకు 54,760 టన్నుల ఉల్లిని ఎగుమతి చేసేందుకు అనుమతించింది.

Updated : 23 Feb 2024 05:30 IST

దిల్లీ: దేశంలో ఉల్లి ఎగుమతులపై విధించిన నిషేధాన్ని పాక్షికంగా సడలిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్‌, మారిషస్‌, బహ్రెయిన్‌, భూటాన్‌ దేశాలకు 54,760 టన్నుల ఉల్లిని ఎగుమతి చేసేందుకు అనుమతించింది. బంగ్లాదేశ్‌కు 50 వేల టన్నులు, మారిషస్‌కు 1,200 టన్నులు, బహ్రెయిన్‌కు 3 వేల టన్నులు, భూటాన్‌కు 560 టన్నుల ఉల్లిని ఎగుమతి చేసేందుకు అంగీకరించినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్‌కుమార్‌ సింగ్‌ వెల్లడించారు. మార్చి 31 లోగా ఈ ఉల్లిని ఎగుమతి చేసేందుకు వ్యాపారులకు అనుమతి ఉందని స్పష్టంచేశారు. వివిధ దేశాల అభ్యర్థనల నేపథ్యంలో విదేశీ వ్యవహారాల శాఖ సూచన మేరకు ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుందని చెప్పారు. సాగు విస్తీర్ణం తగ్గి, రబీ సీజన్లోనూ ఉల్లి దిగుబడి తక్కువే ఉండేలా కనిపిస్తుండడంతో మార్చి 31 తర్వాత కూడా నిషేధం కొనసాగవచ్చని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని