అమేఠీలో ఇల్లు కట్టి.. గృహప్రవేశం చేసిన స్మృతీఇరానీ

చెప్పినట్టుగానే తన నియోజకవర్గం అమేఠీలో కొత్త ఇంటిని నిర్మించుకున్నారు కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ. ఆమె గురువారం తన భర్త జుబిన్‌ ఇరానీతో కలిసి గృహ ప్రవేశం  చేశారు.

Published : 23 Feb 2024 04:32 IST

అమేఠీ: చెప్పినట్టుగానే తన నియోజకవర్గం అమేఠీలో కొత్త ఇంటిని నిర్మించుకున్నారు కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ. ఆమె గురువారం తన భర్త జుబిన్‌ ఇరానీతో కలిసి గృహ ప్రవేశం  చేశారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న వేళ జరిగిన ఈ కార్యక్రమం ప్రాధాన్యం సంతరించుకుంది. 2019 ఎన్నికల్లో తాను గెలిస్తే అమేఠీ తన శాశ్వత చిరునామాగా మారుతుందని అప్పటి ప్రచారంలో స్మృతీ ఇరానీ హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే ఆమె 2021లో 15వేల చదరపు అడుగుల స్థలాన్ని కొనుగోలు చేశారు. తాజాగా గృహప్రవేశం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని