ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి స్థానిక సంస్థల ఎన్నికలే కీలకం: సుప్రీం

స్థానిక సంస్థల స్థాయిలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగితేనే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంపై ప్రజలకు విశ్వాసం కలుగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Updated : 23 Feb 2024 06:22 IST

దిల్లీ: స్థానిక సంస్థల స్థాయిలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగితేనే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంపై ప్రజలకు విశ్వాసం కలుగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని పేర్కొంటూ, ఆప్‌-కాంగ్రెస్‌ కూటమి అభ్యర్థి కుల్దీప్‌ కుమార్‌ను మేయర్‌గా ప్రకటిస్తూ ఈ నెల 20న సర్వోన్నత న్యాయస్థానం తీర్పిచ్చిన సంగతి తెలిసిందే. తీర్పు పూర్తి పాఠం గురువారం సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ అయింది. తీర్పులో.. స్థానిక సంస్థల ఎన్నికల ప్రాధాన్యతను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం వివరించింది. దేశ సువిశాల ప్రజాస్వామ్య నిర్మాణానికి స్థానిక సంస్థల ఎన్నికలు సూక్ష్మ రూపమని పేర్కొంది. ఇవి పౌరుల దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తాయని, ప్రజలతో నేరుగా ప్రాథమిక సంబంధాలను నెరిపేవి కూడా ఇవేనని తెలిపింది. ఈ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగడం.. ప్రాతినిధ్య ప్రజాస్వామ్య చట్టబద్ధతకు, విశ్వసనీయతకు తప్పనిసరి అని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని