బస్సు ఢీకొని వ్యక్తి మృతి... రూ.1.49 కోట్ల పరిహారానికి ట్రైబ్యునల్‌ ఆదేశం

నాసిక్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి తరఫు బంధువులకు రూ.1.49కోట్ల పరిహారం చెల్లించాలని మోటార్‌ యాక్సిడెంట్‌ క్లెయిమ్స్‌ ట్రైబ్యునల్‌ తీర్పునిచ్చింది.

Published : 23 Feb 2024 05:43 IST

ఠాణే: నాసిక్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి తరఫు బంధువులకు రూ.1.49కోట్ల పరిహారం చెల్లించాలని మోటార్‌ యాక్సిడెంట్‌ క్లెయిమ్స్‌ ట్రైబ్యునల్‌ తీర్పునిచ్చింది. నీలేశ్‌ జోషి (39) అనే వ్యక్తి 2018లో ఎస్‌యూవీలో వెళ్తుండగా.. నాసిక్‌ సమీపంలో ఓ బస్సు ఢీ కొట్టింది. నీలేశ్‌తో పాటు మరో అయిదుగురు ఆ ప్రమాదంలో మృతి చెందారు. చనిపోయే నాటికి నీలేశ్‌ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ... నెలకు రూ.లక్ష వేతనం పొందుతున్నారు. మరో కన్సల్టెన్సీ సంస్థకు అందిస్తున్న సేవలకు గాను నెలకు రూ.75వేలు సంపాదిస్తున్నారని అతని బంధువులు ట్రైబ్యునల్‌కు వివరించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం...నీలేశ్‌ బంధువులకు రూ.1.49 కోట్ల పరిహారాన్ని చెల్లించాలని, పిటిషన్‌ దాఖలు చేసినప్పటి నుంచి ఆ మొత్తానికి 7.5శాతం వడ్డీని కూడా లెక్కించి జత చేయాలని తీర్పు వెలువరించింది. ఈ మేరకు బస్సు యజమానికి, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌కు ఆదేశాలిచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని