‘గగన్‌యాన్‌’ ఇంజిన్‌ పరీక్ష విజయవంతం

గగన్‌యాన్‌ ప్రాజెక్టులో వినియోగించనున్న క్రయోజనిక్‌ ఇంజిన్‌కు సంబంధించి సన్నాహక పరీక్ష విజయవంతమైంది.

Published : 23 Feb 2024 04:39 IST

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: గగన్‌యాన్‌ ప్రాజెక్టులో వినియోగించనున్న క్రయోజనిక్‌ ఇంజిన్‌కు సంబంధించి సన్నాహక పరీక్ష విజయవంతమైంది. తమిళనాడులోని నెల్లై జిల్లా మహేంద్రగిరిలోని ఇస్రో ప్రాంగణంలో బుధవారం ఈ ప్రక్రియను నిర్వహించారు. గగన్‌యాన్‌లో పాల్గొననున్న వ్యోమగాములు భూమి నుంచి 400 కి.మీ. ఎత్తులోని కక్ష్యలో మూడు రోజులు గడపనున్నారు. వెహికల్‌ మార్క్‌-3 రాకెట్‌ను ఈ ప్రాజెక్టు కోసం ఇస్రో సిద్ధం చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని