కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుపై కమిటీ

కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుపై సిఫార్సులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది.

Published : 24 Feb 2024 03:34 IST

దిల్లీ: కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుపై సిఫార్సులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో ఉన్న మౌలిక సదుపాయాల్ని వినియోగించుకుని.. కళాశాలలు ఏర్పాటుచేసేలా సిఫార్సులు చేయడం కమిటీ ముఖ్య ఉద్దేశం. సాధ్యాసాధ్యాల అంచనా, మార్గసూచీ అమలు, బడ్జెట్‌ ప్రభావాలు, సంబంధిత అధికారుల పరిశీలనకు కాలావధి నిర్ధారణ.. తదితర అంశాలపై సిఫార్సులు చేయాలని కమిటీకి సూచించారు. ఈ 14 మంది కమిటీకి నీతి ఆయోగ్‌ సభ్యుడు(ఆరోగ్యం) నేతృత్వం వహిస్తారు. కేంద్రంలోని వివిధ మంత్రిత్వశాఖలకు చెందిన వారు కమిటీలో సభ్యులుగా ఉంటారు. నాలుగునెలల్లో కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖకు సిఫార్సుల నివేదికను ఇవ్వాలని కమిటీకి గడువు నిర్దేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని