కేజ్రీవాల్‌ అరెస్టుకు సీబీఐ యత్నం.. ఆప్‌ సంచలన వ్యాఖ్యలు

ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను మరికొన్ని రోజుల్లో అరెస్టు చేయడానికి కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సిద్ధమవుతోందని, ఆ మేరకు నోటీసులు ఇవ్వడానికి సమాయత్తమవుతోందని ఆ పార్టీ సంచలన వ్యాఖ్యలు చేసింది.

Published : 24 Feb 2024 03:34 IST

దిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను మరికొన్ని రోజుల్లో అరెస్టు చేయడానికి కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సిద్ధమవుతోందని, ఆ మేరకు నోటీసులు ఇవ్వడానికి సమాయత్తమవుతోందని ఆ పార్టీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆప్‌-కాంగ్రెస్‌ పొత్తును అడ్డుకోవడానికే భాజపా ఇలా చేస్తోందని ఆరోపించింది. శుక్రవారం ఇక్కడ ఆప్‌ సీనియర్‌ నేత, మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘ఆప్‌-కాంగ్రెస్‌ మధ్య సీట్ల సర్దుబాటు తుది దశకు చేరిందనే సమాచారం రాగానే కేజ్రీవాల్‌కు.. ఈడీ తాజాగా నోటీసులు పంపింది. రెండు, మూడు రోజుల్లో ఆయన్ను సీబీఐ అరెస్టు చేయడానికి సిద్ధమవుతోందన్న సమాచారం మాకు విశ్వసనీయంగా తెలిసింది. రెండు పార్టీల మధ్య పొత్తును చూసి భాజపా భయపడుతోంది. పొత్తు ఖరారైతే ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అరెస్టు అవుతారని మాకు సందేశాలు వస్తున్నాయి. కావాలంటే మీరు సీఎంను అరెస్టు చేసుకోండి. కానీ పొత్తు మాత్రం ఖాయం’’ అని భరద్వాజ్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని