ప్రధాని మోదీపై గూగుల్‌ ‘జెమిని’ వివాదాస్పద సమాధానం

ప్రధాని మోదీ గురించి అడిగిన ఓ ప్రశ్నకు గూగుల్‌కు చెందిన అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌ ఏఐ టూల్‌ ‘జెమిని’ ఇచ్చిన సమాధానం వివాదాస్పదమైంది.

Published : 24 Feb 2024 04:03 IST

దిల్లీ: ప్రధాని మోదీ గురించి అడిగిన ఓ ప్రశ్నకు గూగుల్‌కు చెందిన అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌ ఏఐ టూల్‌ ‘జెమిని’ ఇచ్చిన సమాధానం వివాదాస్పదమైంది. అదే ప్రశ్నను అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ గురించి అడగ్గా మరో విధంగా జవాబిచ్చింది. ఈ విషయాన్ని కేంద్రప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ స్పందిస్తూ.. ‘ఇది ఐటీ చట్టం నిబంధనల ప్రత్యక్ష ఉల్లంఘన కిందకు వస్తుంది. క్రిమినల్‌ కోడ్‌ నిబంధనలను కూడా ఉల్లంఘించినట్లే’ అని హెచ్చరించారు. ఏఐ ఇచ్చిన సమాధానాల స్కీన్ర్‌షాట్లను ఓ జర్నలిస్టు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గూగుల్‌ ఏఐ టూల్‌ పక్షపాతంగా వ్యవహరిస్తోందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని