మహువా అభ్యర్థనను తిరస్కరించిన దిల్లీ హైకోర్టు

తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) నాయకురాలు మహువా మొయిత్రాకు దిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం(ఫెమా) కేసులో తనపై జరిపిన విచారణకు సంబంధించిన రహస్య సమాచారాన్ని మీడియాకు ఈడీ తెలుపుతోందన్న ఆరోపణలపై మహువా వేసిన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు తిరస్కరించింది.

Published : 24 Feb 2024 04:18 IST

దిల్లీ: తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) నాయకురాలు మహువా మొయిత్రాకు దిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం(ఫెమా) కేసులో తనపై జరిపిన విచారణకు సంబంధించిన రహస్య సమాచారాన్ని మీడియాకు ఈడీ తెలుపుతోందన్న ఆరోపణలపై మహువా వేసిన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ప్రసుత్తం కొనసాగుతున్న విచారణలో సున్నిత విషయాలను ఈడీ మీడియాకు తెలపకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని దిల్లీ హైకోర్టును మహువా అభ్యర్థించారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ సుబ్రమణ్యం ప్రసాద్‌ ధర్మాసనం కేసును కొట్టివేసింది. మాజీ ఎంపీ తరఫున కోర్టుకు హాజరైన సీనియర్‌ న్యాయవాది మాట్లాడుతూ...మహువాను వెంటాడుతున్నారు, ఈడీ జారీచేసిన సమన్లను ఆమె అందుకోకముందే మీడియా ప్రచురించిందని పేర్కొన్నారు. ఫెమా నిబంధనల ఉల్లంఘన కారణంగా మహువాకు ఈడీ ఈ నెల 15న సమన్లు జారీచేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు