చైనా మైండ్‌ గేమ్స్‌ ఆడుతుంది: జైశంకర్‌

భారత్‌-చైనా సంబంధాలను ద్వైపాక్షిక చట్రంలో ఇరికించడానికి బీజింగ్‌ మైండ్‌ గేమ్స్‌ ఆడుతుందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ శుక్రవారం హెచ్చరించారు.

Updated : 24 Feb 2024 09:13 IST

దిల్లీ: భారత్‌-చైనా సంబంధాలను ద్వైపాక్షిక చట్రంలో ఇరికించడానికి బీజింగ్‌ మైండ్‌ గేమ్స్‌ ఆడుతుందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ శుక్రవారం హెచ్చరించారు. సంబంధాల్లో సమతౌల్యతకు సంబంధించి మెరుగైన విధానాల కోసం ప్రపంచంలోని ఇతర అంశాలను ఉపయోగించుకోవడానికి సంబంధించి భారత్‌ తన హక్కులను వదులుకోకూడదని స్పష్టంచేశారు. దిల్లీలో జరుగుతున్న రైసీనా డైలాగ్‌ చర్చల్లో శుక్రవారం ఆయన మాట్లాడారు. సంబంధాల్లో సమతౌల్యత సాధించడం, కొనసాగించడమనేది రెండు దేశాలకు అతిపెద్ద సవాళ్లలో ఒకటిగా మారబోతోందని చెప్పారు. తూర్పు లద్ధాఖ్‌లో వివాదానికి కారణమైన చైనా ఒప్పందాల ఉల్లంఘనే ప్రస్తుతం రెండు దేశాల మధ్య సత్వరం పరిష్కరించాల్సిన అంశమన్నారు.

అందుకే రష్యా ఆసియా వైపు చూస్తోంది..

పాశ్చాత్య దేశాలు ఒకవైపు రష్యాను చైనా కౌగిలిలోకి నెడుతూనే, మరోవైపు వారిద్దరూ కలసిపోతున్నారంటూ గగ్గోలు పెట్టడం వింతగా ఉందని జైశంకర్‌ పేర్కొన్నారు. పాశ్చాత్య దేశాలు తలుపులు మూసేయడం వల్లే రష్యా ఆసియా వైపు, పాశ్చాత్యేతర దేశాలవైపు జరుగుతోందన్నారు. రష్యా మొదటి నుంచీ గొప్ప రాజనీతిజ్ఞత కలిగిన దేశమని, ఏ ఒక్క దేశం (చైనా)తో మాత్రమే సంబంధాలు కొనసాగించదని జైశంకర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని