బాలికలకు కలకత్తా హైకోర్టు జడ్జీలు సూచనలివ్వడంపై విచారణ మే 2న: సుప్రీంకోర్టు

కిశోరప్రాయ బాలికలు తమ లైంగిక వాంఛలను నియంత్రించుకోవాలంటూ ఓ తీర్పులో కలకత్తా హైకోర్టు జడ్జీలు చేసిన సూచనలకు సంబంధించిన వ్యాజ్యంపై మే 2న విచారణ జరపనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.

Published : 24 Feb 2024 04:08 IST

దిల్లీ: కిశోరప్రాయ బాలికలు తమ లైంగిక వాంఛలను నియంత్రించుకోవాలంటూ ఓ తీర్పులో కలకత్తా హైకోర్టు జడ్జీలు చేసిన సూచనలకు సంబంధించిన వ్యాజ్యంపై మే 2న విచారణ జరపనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. 20ఏళ్ల జైలు శిక్షపడిన వ్యక్తిని నిర్దోషిగా ప్రకటిస్తూ హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలపై సర్వోన్నత న్యాయస్థానం గత ఏడాది డిసెంబరు 8న తీవ్ర అభ్యంతరం తెలిపింది. న్యాయమూర్తులు తీర్పుల్లో ప్రవచనాలు చేయరాదని పేర్కొంటూ తనకు తానుగా ఈ కేసును విచారణకు చేపట్టింది. మరోవైపున పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం కూడా హైకోర్టు తీర్పుపై అప్పీలు దాఖలు చేసింది. ఈ రెండూ శుక్రవారం విచారణకు రాగా... మే 2న విచారణ జరుపుతామని జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓక్‌, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఈ కేసులో బాధితురాలైన బాలిక...తన న్యాయవాదితో కలిసి మార్చి 7వ తేదీలోగా తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని