యూపీలో పోలీసు నియామక పరీక్ష రద్దు

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల నిర్వహించిన పోలీస్‌ కానిస్టేబుల్‌ నియామక పరీక్షను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్నాపత్రం లీక్‌ అయిందనే ఆరోపణలే దీనికి కారణం.

Published : 25 Feb 2024 05:15 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల నిర్వహించిన పోలీస్‌ కానిస్టేబుల్‌ నియామక పరీక్షను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్నాపత్రం లీక్‌ అయిందనే ఆరోపణలే దీనికి కారణం. మరో ఆరు నెలల్లో పరీక్షను తిరిగి నిర్వహించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఘటనపై స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌(ఎస్‌టీఎఫ్‌) చేత దర్యాప్తు చేయించాలని నిర్ణయించింది. ఈనెల 17, 18 తేదీల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 48 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 240 మందిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

ఇది యువశక్తి సాధించిన అతిపెద్ద విజయం: రాహుల్‌గాంధీ

కానిస్టేబుల్‌ పరీక్షను రద్దు చేస్తూ యూపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్వాగతించారు. ఇది యువత ఐక్యమత్యానికి, విద్యార్థుల శక్తికి లభించిన అతిపెద్ద విజయమని అభివర్ణించారు. ‘ఐక్యమత్యంగా ఉన్నవారు విజయం సాధిస్తారు. విడిపోయిన వారు ఓడిపోతారు. ఐక్యమత్యంగా ఉంటేనే మన హక్కుల్ని కాపాడుకోగలం. ప్రశ్నాపత్రాల లీకేజీ విషయాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది’ అని ఎక్స్‌ వేదికగా రాహుల్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని