సమకాలీన అంశాల లిస్టింగ్‌లో ఆలస్యంతో న్యాయం నాణ్యతపై ప్రభావం

పెద్ద నోట్ల రద్దు, అధికరణం-370 రద్దు వంటి సమకాలీన అంశాల విచారణకు తేదీలను నిర్ణయించడంలో సుదీర్ఘ జాప్యం, ఊహించిన తీర్పులే వెలువడడం వంటి అంశాలు న్యాయం నాణ్యతను ప్రభావితం చేస్తున్నాయని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బి.లోకుర్‌ పేర్కొన్నారు.

Published : 25 Feb 2024 05:16 IST

జస్టిస్‌ మదన్‌ బి.లోకుర్‌ వ్యాఖ్యలు

దిల్లీ: పెద్ద నోట్ల రద్దు, అధికరణం-370 రద్దు వంటి సమకాలీన అంశాల విచారణకు తేదీలను నిర్ణయించడంలో సుదీర్ఘ జాప్యం, ఊహించిన తీర్పులే వెలువడడం వంటి అంశాలు న్యాయం నాణ్యతను ప్రభావితం చేస్తున్నాయని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బి.లోకుర్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా న్యాయవ్యవస్థలో ‘ఏదో తప్పు’ జరుగుతోందన్న భావన సైతం ఉద్భవిస్తోందని వ్యాఖ్యానించారు. క్యాంపెయిన్‌ ఫర్‌ జ్యుడీషియల్‌ అకౌంటబిలిటి అండ్‌ రిఫార్మ్స్‌ (సీజేఏఆర్‌) ఏర్పాటుచేసిన సదస్సులో భాగంగా ‘సుప్రీంకోర్టు అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌’ అన్న అంశంపై శనివారం జస్టిస్‌ మదన్‌ బి లోకుర్‌ ప్రసంగించారు. కేసుల లిస్టింగ్‌ సమస్య కొత్తదేమీ కాదని, చాన్నాళ్లుగా ప్రత్యేకించి సుప్రీంకోర్టులో చాన్నాళ్లుగా ఉందని స్పష్టంచేశారు. ‘‘ఈ రోజు ఒక కేసు ఫలానా ధర్మాసనం ముందుకు వెళితే.. వచ్చే ఫలితమిది అనే భావన పెరిగిపోయింది’’ అని చెప్పారు. ఉపా, నగదు అక్రమ చలామణీ నిరోధక చట్టం తదితర చట్టాల కింద అరెస్టైన కేసుల్లో బెయిలు పొందడం దాదాపు అసాధ్యమని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని