రాజ్యసభ అభ్యర్థుల్లో 36% మందిపై క్రిమినల్‌ కేసులు

రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థుల్లో 36% మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని, ఒక్కో అభ్యర్థికి సగటున రూ.127.81 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రీఫార్మ్స్‌ (ఏడీఆర్‌) సంస్థ తెలిపింది.

Published : 25 Feb 2024 05:17 IST

దిల్లీ: రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థుల్లో 36% మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని, ఒక్కో అభ్యర్థికి సగటున రూ.127.81 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రీఫార్మ్స్‌ (ఏడీఆర్‌) సంస్థ తెలిపింది. ఈ నెల 27న రాజ్యసభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో 15 రాష్ట్రాల్లోని 56 రాజ్యసభ స్థానాలకు 59 మంది పోటీపడుతున్నారు. వీరిలో 58 మంది ప్రమాణపత్రాలను ఏడీఆర్‌ విశ్లేషించింది. ఈ 58 మందిలో 17% మందిపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులున్నాయి. మరొకరిపై హత్యాయత్నం కేసు ఉందని ఏడీఆర్‌ పేర్కొంది. దాదాపుగా 21% మంది అభ్యర్థులు బిలియనీర్లు (రూ.100 కోట్లకు పైగా ఆస్తులు కలవారు). 17% మంది అభ్యర్థుల విద్యార్హతలు 5 నుంచి 12 తరగతి మధ్య ఉండగా..79 శాతం మంది డిగ్రీ పూర్తి చేశారు. 51-70ఏళ్ల వయసు ఉన్నవారు 76% ఉండగా, 31-50 ఏళ్ల వారు 16% ఉన్నారు. మహిళలు కేవలం 19 శాతమే ఉండడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని