5 గంటలు రన్‌వేపై విమానంలోనే.. ఊపిరాడక చిన్నారులకు అస్వస్థత

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ మారిషస్‌కు చెందిన ఓ విమానంలో శనివారం సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో ప్రయాణికులు కొన్ని గంటల పాటు విమానంలోనే ఉండిపోయారు.

Published : 25 Feb 2024 05:17 IST

ముంబయి: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ మారిషస్‌కు చెందిన ఓ విమానంలో శనివారం సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో ప్రయాణికులు కొన్ని గంటల పాటు విమానంలోనే ఉండిపోయారు. ఈ క్రమంలోనే పలువురు చిన్నారులు ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. ఎంకే 749 విమానం శనివారం తెల్లవారుజామున 4.30 గంటలకు ముంబయి నుంచి మారిషస్‌ బయల్దేరాల్సి ఉంది. 3.45 గంటల నుంచి ప్రయాణికులను విమానంలోకి అనుమతించారు. అందరూ ఎక్కిన తర్వాత టేకాఫ్‌ చేస్తుండగా ఇంజిన్‌ లో సమస్య ఏర్పడింది. దీంతో విమానాన్ని రన్‌వేపైనే నిలిపివేశారు. ప్రయాణికులు కిందకు దిగేందుకు అనుమతించలేదు. దాదాపు 5 గంటలపాటు వారు అందులోనే ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో ఏసీలు పనిచేయకపోవడంతో ప్రయాణికుల్లోని పలువురు చిన్నారులు, వృద్ధులు అస్వస్థతకు గురయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని