విమానంలో భద్రతకు ‘క్లాసికల్‌’ టచ్‌..

విమాన ప్రయాణాల్లో భద్రతా సూచనలు పాటించాలంటూ ఎయిర్‌ హోస్టెస్‌, మైక్‌ల ద్వారా ప్రయాణికులకు ఆయా సంస్థలు చెబుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ఎయిరిండియా ఓ విన్నూత ఆలోచనకు శ్రీకారం చుట్టింది.

Published : 25 Feb 2024 05:18 IST

ఎయిరిండియా ఆలోచన అదుర్స్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: విమాన ప్రయాణాల్లో భద్రతా సూచనలు పాటించాలంటూ ఎయిర్‌ హోస్టెస్‌, మైక్‌ల ద్వారా ప్రయాణికులకు ఆయా సంస్థలు చెబుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ఎయిరిండియా ఓ విన్నూత ఆలోచనకు శ్రీకారం చుట్టింది. తమ ప్రయాణికుల రక్షణ నిమిత్తం ఈ భద్రతకు క్లాసికల్‌ టచ్‌ ఇచ్చింది. భారత్‌లో ప్రముఖ సంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, బిహు, కథాకళి, కథక్‌, మోహినియాట్టం, ఒడిస్సీ, ఘూమర్‌లను సమ్మిళితం చేసి ఒక వీడియోను రూపొందించింది. సీటు బెల్టు ఎలా పెట్టుకోవాలి, ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ వేళ ఏం చేయాలి.. ఇలా అనేక అంశాలను విమానంలో ఎక్కింది మొదలు దిగేంత వరకు ఎలా పాటించాలో నృత్యం రూపంలో వివరించింది. ఈ వీడియోను దర్శకుడు భరత్‌ బాల, గాయకుడు శంకర్‌ మహదేవన్‌, మోక్‌కాన్‌ వరల్డ్‌ గ్రూప్‌నకు చెందిన ప్రసూన్‌ జోషి చిత్రీకరించారు. త్వరలో ఈ వీడియోను తమ విమానాల్లో ప్రదర్శించనున్నట్లు ఎయిరిండియా ఓ ప్రకటనలో వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని