సరకు రవాణా నౌకకు భారత నేవీ సాయం

గల్ఫ్‌ ఆఫ్‌ ఎడెన్‌లో క్షిపణి దాడి అనంతరం మంటల్లో చిక్కుకున్న ఒక వాణిజ్య నౌకకు భారత యుద్ధనౌక సాయం అందించింది. నేవీకి చెందిన పేలుడు పదార్థాల నిపుణులు ఆ నౌకలోకి ప్రవేశించి.. పేలకుండా మిగిలిపోయిన బాంబులు ఏమైనా ఉన్నాయా అన్నది క్షుణ్నంగా తనిఖీ చేశారు.

Published : 25 Feb 2024 05:18 IST

దిల్లీ: గల్ఫ్‌ ఆఫ్‌ ఎడెన్‌లో క్షిపణి దాడి అనంతరం మంటల్లో చిక్కుకున్న ఒక వాణిజ్య నౌకకు భారత యుద్ధనౌక సాయం అందించింది. నేవీకి చెందిన పేలుడు పదార్థాల నిపుణులు ఆ నౌకలోకి ప్రవేశించి.. పేలకుండా మిగిలిపోయిన బాంబులు ఏమైనా ఉన్నాయా అన్నది క్షుణ్నంగా తనిఖీ చేశారు. అంతా సవ్యంగా ఉందనుకున్నాక దాని ప్రయాణానికి అనుమతించారు. బ్రిటన్‌కు చెందిన ఎంవీ ఐలాండర్‌ అనే ఆ నౌకపైకి ఈ నెల 22న హూతీ మిలిటెంట్లు రెండు నౌకా విధ్వంసక బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించారు. దీనివల్ల నౌక స్వల్పంగా దెబ్బతింది. దాని సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. ఆ నౌక నుంచి వచ్చిన అత్యవసర సందేశానికి మన నౌకాదళం స్పందించింది. ఆ ప్రాంతంలో మోహరించిన భారత డిస్ట్రాయర్‌ యుద్ధనౌక వెంటనే ఎంవీ ఐలాండర్‌ వద్దకు చేరుకుంది. తొలుత నౌకలోకి చేరుకున్న నేవీ వైద్య బృందం.. గాయపడిన సిబ్బందికి చికిత్స అందించింది. అనంతరం పేలుడు పదార్థాల నిపుణులు పరిశీలనలు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని