ముస్లిం వివాహ చట్టం రద్దుకు అస్సాం మంత్రివర్గం ఆమోదం

అస్సాం ముస్లిం వివాహాలు, విడాకుల నమోదు చట్టం-1935 రద్దుకు అస్సాం మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు.

Published : 25 Feb 2024 05:22 IST

ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ వెల్లడి

గువాహటి: అస్సాం ముస్లిం వివాహాలు, విడాకుల నమోదు చట్టం-1935 రద్దుకు అస్సాం మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు. బాల్య వివాహాలకు స్వస్తి పలికేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ‘‘చట్ట ప్రకారం వరుడు, వధువులకు అవసరమైన కనీస వివాహ వయసు 21 సంవత్సరాలు, 18 సంవత్సరాలు రాకపోయినప్పటికీ వివాహాన్ని నమోదు చేసేందుకు అవసరమైన నిబంధనలు ఈ చట్టంలో ఉన్నాయి. శుక్రవారం రాత్రి మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయం అస్సాంలో బాల్య వివాహాలను నిషేధించేందుకు సంబంధించి మరో కీలక ముందడుగుగా నిలవనుంది’’ అని ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని