వచ్చే 100 రోజులకు కార్యాచరణ ప్రణాళికలతో రండి

వచ్చేనెల మూడో తేదీన జరగనున్న కేంద్ర మంత్రిమండలి సమావేశానికి నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికలతో రావాలని మంత్రులకు ప్రధాని నరేంద్రమోదీ సూచించారు.

Published : 25 Feb 2024 05:23 IST

మార్చి 3 సమావేశంపై మంత్రులకు మోదీ సూచన

దిల్లీ: వచ్చేనెల మూడో తేదీన జరగనున్న కేంద్ర మంత్రిమండలి సమావేశానికి నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికలతో రావాలని మంత్రులకు ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. ఎన్నికలకు ముందు 100 రోజుల కార్యాచరణపై ఆ సమావేశంలో మంత్రులంతా నివేదించాలని కోరారు. కార్యరూపంలోకి తీసుకురాగలిగేలా, నిర్దిష్టంగా చెప్పగల రీతిలో, స్పష్టంగా నిర్వచించగల ప్రణాళికలను సిద్ధం చేయాలని చెప్పారు. సీనియర్‌ అధికారులు సహా అనుభవజ్ఞులను, ఆయా రంగంలో ఆరితేరినవారిని విస్తృతంగా సంప్రదించాక ప్రణాళికను సిద్ధం చేయాలని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ నడుస్తున్న సమయంలోనూ ప్రభుత్వ పని కొనసాగేలా చూడడమే ప్రధాని ఉద్దేశమని సంబంధిత వర్గాలు తెలిపాయి. లోక్‌సభ ఎన్నికల్లో మూడోసారి కూడా విజయం సాధించడంపై భాజపా విశ్వాసం కనపరుస్తోంది. దీనిలో భాగంగా 15 లక్షల మందికి పైగా ప్రజల నుంచి సలహాలు స్వీకరించినట్లు మోదీ ఇటీవల తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని