ఓటర్లకు ఆ హక్కు ఉంది

ఎన్నికల సందర్భంగా రాజకీయపార్టీలు ఇచ్చే హామీల అమలు సాధ్యాసాధ్యాల గురించి తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ పేర్కొన్నారు. 

Updated : 25 Feb 2024 06:46 IST

హామీల అమలు సాధ్యాసాధ్యాలను తెలుసుకోవడంపై సీఈసీ స్పష్టీకరణ

చెన్నై: ఎన్నికల సందర్భంగా రాజకీయపార్టీలు ఇచ్చే హామీల అమలు సాధ్యాసాధ్యాల గురించి తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ పేర్కొన్నారు.  మేనిఫెస్టోలో హామీలు ఇచ్చే హక్కు పార్టీలకు ఉంటుందని, ఆ హామీలు నిజమైనవేనా, ఆయా కార్యక్రమాలకు నిధులు ఎలా సమకూర్చుతారు వంటి విషయాలు తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉంటుందన్నారు.అదే సమయంలో ఈ విషయం ప్రస్తుతం ఓ కేసులో భాగంగా ఉందని, ఈ వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉందని స్పష్టంచేశారు. చెన్నైలో శనివారం రాజీవ్‌కుమార్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఎన్నికల ముందు బదిలీలపై ఈసీ ‘సీరియస్‌ నోట్‌’

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల ముందు ఓ జిల్లా నుంచి బదిలీ అయిన అధికారులను అదే పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న మరో జిల్లాలో నియమించకుండా చూడాలని రాష్ట్రాలను  ఈసీ కోరింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న జిల్లాలకు చెందిన అధికారులను స్వలాభం కోసం బదిలీ చేయడంపై ఈసీ ‘సీరియస్‌ నోట్‌’ జారీ చేస్తూ.. ‘‘ఒకే జిల్లాలో మూడు సంవత్సరాలు పనిచేసిన అధికారులను లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికల ముందు బదిలీ చేయాలి. వారి స్థాయి, విధి విధానాలకు ఆటంకం కలగకుండా కమిషన్‌ ప్రస్తుత బదిలీ విధానాన్ని పటిష్ఠం చేసింది’’ అని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని