దేహానికి జింక్‌ అవసరమని నాణేలు, అయస్కాంతాలు మింగాడు

ఆకలేస్తే ఎవరైనా అన్నమో, నచ్చిన ఇతర ఆహారమో తింటారు. దిల్లీకి చెందిన 26 ఏళ్ల యువకుడు ఏకంగా నాణేలు, అయస్కాంతం ముక్కలను తిన్నాడు.

Updated : 28 Feb 2024 07:55 IST

ఈటీవీ భారత్‌: ఆకలేస్తే ఎవరైనా అన్నమో, నచ్చిన ఇతర ఆహారమో తింటారు. దిల్లీకి చెందిన 26 ఏళ్ల యువకుడు ఏకంగా నాణేలు, అయస్కాంతం ముక్కలను తిన్నాడు. కడుపునొప్పితో ఇబ్బందిపడుతున్న అతణ్ని కుటుంబసభ్యులు సర్‌ గంగారాం ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు రోగి పొట్టలో రెండు, అయిదు రూపాయల నాణేలు 39, వివిధ పరిమాణాల్లో ఉన్న 37 అయస్కాంతాలను గుర్తించి అవాక్కయ్యారు. శస్త్రచికిత్స చేసి వాటిని తొలగించినట్లు ల్యాప్రొస్కోపిక్‌ సర్జన్‌ తరుణ్‌ మిట్టల్‌ ఆధ్వర్యంలోని వైద్యబృందం తెలిపింది. ఏడు రోజులపాటు చికిత్స అందించాక డిశ్చార్జి చేసినట్లు డాక్టర్‌ తరుణ్‌ మిట్టల్‌ తెలిపారు. నాణేలు, అయస్కాంతాలు మింగడానికి యువకుడు చెప్పిన కారణం విన్న వైద్యులు విస్తుపోయారు. ‘‘శరీరానికి జింక్‌ అవసరమని ఎక్కడో చదివా. నాణేల్లో జింక్‌ ఉంటుందని, అది నా దేహాన్ని ధృడంగా ఉంచుతుందని మింగాను. నాణేలు శరీరం నుంచి బయటకు రాకుండా ఉండేందుకు అయస్కాంతాలు మింగాను’’ అని అతడు తెలిపాడు. యువకుడి మానసిక పరిస్థితిపై బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని