58 ఏళ్ల వయసులో మరో బిడ్డకు జన్మ!

దాదాపు రెండేళ్ల కిందట దారుణహత్యకు గురైన యువ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా తల్లిదండ్రులు త్వరలో తమ కుటుంబంలోకి మరో చిన్నారిని ఆహ్వానించనున్నారు.

Published : 28 Feb 2024 04:27 IST

కడుపుకోత మరచిపోయేందుకు..

దాదాపు రెండేళ్ల కిందట దారుణహత్యకు గురైన యువ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా తల్లిదండ్రులు త్వరలో తమ కుటుంబంలోకి మరో చిన్నారిని ఆహ్వానించనున్నారు. సిద్ధూ తల్లి చరణ్‌కౌర్‌ మార్చి నెలలో ఇంకో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ఆయన కుటుంబవర్గాల సమాచారం. పలు జాతీయ మీడియా కథనాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. సిద్ధూ మూసేవాలా 2022 మే 29న దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. మాన్సా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్తుండగా.. మార్గమధ్యంలో దుండగులు అడ్డగించి కాల్చి చంపారు. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. తన తల్లిదండ్రులకు సిద్ధూ ఒక్కడే సంతానం. కన్నబిడ్డను కోల్పోయి కుంగిపోయిన వారు వృద్ధాప్యంలో తోడు కోసం మరో బిడ్డను కనాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఐవీఎఫ్‌ (బాహ్య ఫలదీకరణ) పద్ధతిలో చరణ్‌కౌర్‌ గర్భం దాల్చినట్లు ఆమె సోదరుడు తెలిపారు. ప్రస్తుతం చరణ్‌కౌర్‌ వయసు 58 ఏళ్లు కాగా.. సిద్ధూ తండ్రి బాల్‌కౌర్‌ సింగ్‌ వయసు 60 ఏళ్లు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని