Jaya Prada: జయప్రదను 6వ తేదీలోపు హాజరు పరచండి

ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన రెండు కేసుల్లో మాజీ ఎంపీ, సినీనటి జయప్రదను ‘పరారీ’లో ఉన్న వ్యక్తిగా ప్రకటించిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని రామ్‌పుర్‌ కోర్టు.. ఆమెను అరెస్టుచేసి, మార్చి 6వ తేదీలోపు తమ ముందు హాజరుపరచాల్సిందిగా మంగళవారం పోలీసులను ఆదేశించింది.

Updated : 28 Feb 2024 07:32 IST

యూపీలోని రామ్‌పుర్‌ కోర్టు ఆదేశం

రామ్‌పుర్‌ (యూపీ): ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన రెండు కేసుల్లో మాజీ ఎంపీ, సినీనటి జయప్రదను ‘పరారీ’లో ఉన్న వ్యక్తిగా ప్రకటించిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని రామ్‌పుర్‌ కోర్టు.. ఆమెను అరెస్టుచేసి, మార్చి 6వ తేదీలోపు తమ ముందు హాజరుపరచాల్సిందిగా మంగళవారం పోలీసులను ఆదేశించింది. రామ్‌పుర్‌ ఎంపీగా పనిచేసిన జయప్రదపై 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈ కేసులు నమోదయ్యాయి. ఆ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా పోటీచేసిన జయప్రద సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఆజంఖాన్‌ చేతిలో ఓటమిని చవిచూశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసుల్లో ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు పలుమార్లు సమన్లు జారీ చేసినా ఆమె బేఖాతరు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు జయప్రద అరెస్టుకు రామ్‌పుర్‌ ఎస్పీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు