వారసత్వానికి ఆరాటపడని ఎంజీఆర్‌: మోదీ

విపక్ష కూటమిలోని పార్టీలు రాబోయే ఎన్నికల్లో ఓటమిని ముందే అంగీకరించాయని, అయినా తమిళనాడును దోచుకునేందుకు సిద్ధమైపోతున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు.

Published : 28 Feb 2024 04:21 IST

తిరుప్పూర్‌ (తమిళనాడు): విపక్ష కూటమిలోని పార్టీలు రాబోయే ఎన్నికల్లో ఓటమిని ముందే అంగీకరించాయని, అయినా తమిళనాడును దోచుకునేందుకు సిద్ధమైపోతున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. భాజపా తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై రాష్ట్రవ్యాప్త యాత్ర ముగింపును పురస్కరించుకుని తిరుప్పూర్‌లో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. యూపీయే పాలనలో కంటే గత పదేళ్లలోనే తమిళనాడుకు కేంద్రం నుంచి ఎక్కువ నిధులు వచ్చాయని చెప్పారు. తాను అందరి సంక్షేమం కోసం పనిచేసే వ్యక్తినన్నారు. ఇండియా కూటమి నేతలెవరూ ఎన్నడూ విద్య, అభివృద్ధి కోసం మాట్లాడరని, కేవలం తమ కుటుంబాల కోసమే తాపత్రయపడుతుంటారని విమర్శించారు. వారసత్వ రాజకీయాల కోసం దివంగత మాజీ సీఎం ఎం.జి.రామచంద్రన్‌ ఆరాటపడలేదని, డీఎంకే తీరు మాత్రం దీనికి భిన్నమని వ్యాఖ్యానించారు. ఎంజీఆర్‌ తర్వాత తన జీవితాన్ని ప్రజా సంక్షేమానికి అంకితం చేసిన నాయకురాలు జయలలిత మాత్రమేనని కొనియాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని