క్యాన్సర్‌ వ్యాప్తికి కొత్త ముప్పు

మందులు (కీమోథెరపీ), రేడియేషను వల్ల నశించే క్యాన్సర్‌ కణాల నుంచి విడుదలయ్యే క్రోమోజోమ్‌ ఖండికలు రక్తం ద్వారా ఇతర ప్రాంతాలకు చేరి క్యాన్సర్‌ వ్యాప్తి చేస్తాయని ఇక్కడి టాటా మెమోరియల్‌ సెంటర్‌ (టీఎంసీ) అధ్యయనం కనుగొంది.

Updated : 28 Feb 2024 14:58 IST

ముంబయి: మందులు (కీమోథెరపీ), రేడియేషను వల్ల నశించే క్యాన్సర్‌ కణాల నుంచి విడుదలయ్యే క్రోమోజోమ్‌ ఖండికలు రక్తం ద్వారా ఇతర ప్రాంతాలకు చేరి క్యాన్సర్‌ వ్యాప్తి చేస్తాయని ఇక్కడి టాటా మెమోరియల్‌ సెంటర్‌ (టీఎంసీ) అధ్యయనం కనుగొంది. మరణిస్తున్న క్యాన్సర్‌ కణాలు క్రోమాటిన్‌ రేణువులను (క్రోమోజోమ్‌ ఖండికలను) విడుదల చేస్తాయి. ఆ రేణువులు కొన్ని ఆరోగ్యవంతమైన క్రోమోజోమ్‌లలో చేరి కొత్తగా క్యాన్సర్‌ను కలిగిస్తాయని ఎలుకలపై జరిగిన ప్రయోగాలు నిర్ధారించాయి. కీమోథెరపీ, రేడియేషనుతోపాటు శస్త్రచికిత్స వల్ల కూడా ఈ ప్రమాదం ఉంటుంది. క్రోమాటిన్‌ రేణువులను నాశనం చేయగల రసాయనాలను ఇచ్చినప్పుడు ఆ రేణువులు ఆరోగ్యవంతమైన కణాల్లోకి చేరకుండా నివారించగలిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని