72 గంటల్లోగా షాజహాన్‌ను అరెస్టు చేయండి

సందేశ్‌ఖాలీలో మహిళలపై చోటుచేసుకున్న లైంగిక వేధింపులు, భూ అక్రమాల్లో ప్రధాన నిందితుడైన తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత షాజహాన్‌ షేక్‌ను 72 గంటల్లోగా అరెస్టు చేయాలని.. లేనిపక్షంలో అందుకు కారణాలను తనకు నివేదించాలని పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సి.వి.ఆనందబోస్‌ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

Updated : 28 Feb 2024 05:55 IST

లేకపోతే నేనే సందేశ్‌ఖాలీకి వెళ్తా
మమత సర్కారుకు బెంగాల్‌ గవర్నర్‌ లేఖ

కోల్‌కతా: సందేశ్‌ఖాలీలో మహిళలపై చోటుచేసుకున్న లైంగిక వేధింపులు, భూ అక్రమాల్లో ప్రధాన నిందితుడైన తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత షాజహాన్‌ షేక్‌ను 72 గంటల్లోగా అరెస్టు చేయాలని.. లేనిపక్షంలో అందుకు కారణాలను తనకు నివేదించాలని పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సి.వి.ఆనందబోస్‌ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. లేదంటే తానే సందేశ్‌ఖాలీకి మకాం మారుస్తానన్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలో దుండగులు ఓ చిన్నారిని విసిరేశారన్న ఘటనపై విచారణ జరపాలని, అది నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని కూడా గవర్నర్‌ లేఖలో పేర్కొన్నారు. సందేశ్‌ఖాలీ హింసలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న షాజహాన్‌ షేక్‌ను అరెస్టు చేయాలని సోమవారం కోల్‌కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మమత ప్రభుత్వానికి గవర్నర్‌ లేఖ రాశారు. మరోవైపు- సందేశ్‌ఖాలీలో పర్యటించేందుకు యత్నించిన ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌ (ఐఎస్‌ఎఫ్‌) ఎమ్మెల్యే నౌసద్‌ సిద్ధిఖీని పోలీసులు అరెస్టు చేశారు. హింస జరిగిన ప్రాంతానికి 60 కిలోమీటర్ల దూరంలోనే ఆయనను అడ్డగించి కోల్‌కతా పోలీసు ప్రధాన కార్యాలయానికి తరలించారు. సెక్షన్‌ 151 కింద ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. సందేశ్‌ఖాలీలో పర్యటించేందుకు వెళుతున్న రాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు సౌమ్య రాయ్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందాన్ని సైతం పోలీసులు అడ్డుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని