పాలారులో నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు

పాలారులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మాణ పనులు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తమిళనాడు జలవనరులశాఖ మంత్రి దురైమురుగన్‌ హెచ్చరించారు.

Updated : 28 Feb 2024 05:43 IST

తమిళనాడు మంత్రి దురైమురుగన్‌

చెన్నై, న్యూస్‌టుడే: పాలారులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మాణ పనులు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తమిళనాడు జలవనరులశాఖ మంత్రి దురైమురుగన్‌ హెచ్చరించారు. పాలారులో కొత్త ఆనకట్ట నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించిందన్న వార్తను ఉటంకిస్తూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీ ప్రభుత్వ చర్యలు 1892వ ఏడాది ఒప్పందాన్ని అతిక్రమించడమేనని అన్నారు. ఈ చర్యలు సుప్రీంకోర్టును అవమానించడంగా భావించాలని, ఇరు రాష్ట్రాల మైత్రికి గొడ్డలిపెట్టని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా గణేశపురంలో ఆనకట్ట నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నించడాన్ని ఆక్షేపిస్తూ 2006 ఫిబ్రవరి 10న, పాలారులో ఇప్పటికే నిర్మించిన చెక్‌ డ్యామ్‌ల ఎత్తు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ 2016లో సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వం దావాలు వేసిందని గుర్తు చేశారు. అవి పెండింగ్‌లో ఉండగా పాలారులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని