శాల్యూట్‌ సక్రమంగా చేయలేదని ఏసీపీపై జడ్జి ఆగ్రహం

ఓ కేసు విషయమై న్యాయస్థానానికి హాజరైన అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఏసీపీ)...సక్రమమైన రీతిలో శాల్యూట్‌ చేయకపోవడంపై జడ్జి ఆగ్రహించారు.

Published : 29 Feb 2024 06:24 IST

 చర్యలకు ఆదేశం... గురుగ్రామ్‌ కోర్టులో ఘటన

గురుగ్రామ్‌: ఓ కేసు విషయమై న్యాయస్థానానికి హాజరైన అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఏసీపీ)...సక్రమమైన రీతిలో శాల్యూట్‌ చేయకపోవడంపై జడ్జి ఆగ్రహించారు. అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారికి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తును డీసీపీకి అప్పగించారు. ఓ కేసులో నిందితుడిని హాజరుపరిచేందుకు గాను ఏసీపీ నవీన్‌ శర్మ, ఆయన బృందం బుధవారం గురుగ్రామ్‌లోని జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి విక్రాంత్‌కు ఏసీపీ నవీన్‌ శర్మ శాల్యూట్‌ చేసే సమయంలో అతని చేతి వేళ్లు రెండు.. నుదుటిని తాకాయి. ఏసీపీ ప్రవర్తన ప్రొటోకాల్‌కు, నిబంధనలకు విరుద్ధంగా ఉందని జడ్జి విక్రాంత్‌ మండిపడ్డారు. అతనికి సరైన శిక్షణ ఇప్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్‌ కమిషనర్‌కు సూచించారు. తన యూనిఫాం బిగుతుగా ఉండడటంతో శాల్యూట్‌ చేసే సమయంలో ఇబ్బంది ఏర్పడిందని ఏసీపీ నవీన్‌ శర్మ అనంతరం విలేకరులకు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు