జాతీయ పార్టీల వార్షిక ఆదాయం రూ.3,077 కోట్లు

జాతీయ పార్టీలకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.3,077 కోట్ల వార్షిక ఆదాయం సమకూరినట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) సంస్థ వెల్లడించింది.

Published : 29 Feb 2024 04:27 IST

 వెల్లడించిన ఏడీఆర్‌ సంస్థ

దిల్లీ: జాతీయ పార్టీలకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.3,077 కోట్ల వార్షిక ఆదాయం సమకూరినట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) సంస్థ వెల్లడించింది. ఈ మొత్తంలో భాజపా ఆదాయం రూ.2,361 కోట్లు (76.73%). రూ.452.37 కోట్లతో (14.70%) కాంగ్రెస్‌ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. ఆరు జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్‌, బీఎస్పీ, ఆప్‌, ఎన్సీపీ, సీపీఐ (ఎం)ల వార్షిక ఆదాయ, వ్యయ వివరాలపై ఏడీఆర్‌ బుధవారం నివేదిక విడుదల చేసింది. ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా విరాళాల రూపంలో భాజపా, కాంగ్రెస్‌, ఆప్‌ పార్టీలు రూ.1,510.61 కోట్లను (మొత్తం ఆదాయంలో 49.09%) సమకూర్చుకున్నట్లు ఆ నివేదిక పేర్కొంది. 2021-22 నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరాల్లో భాజపా, ఆప్‌, ఎన్సీపీల ఆదాయం పెరగ్గా.. కాంగ్రెస్‌, సీపీఐ (ఎం), బీఎస్పీల ఆదాయం తగ్గింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని