రక్తస్రావ లోపాల జన్యు చికిత్సలకు దేశంలో తొలిసారి ప్రయోగ పరీక్షలు

అధిక సమయం రక్తం గడ్డకట్టకుండా స్రవిస్తూ ఉండేలా పుట్టుకతో వచ్చే లోపాలను సరిచేసే జన్యు చికిత్సలకు సంబంధించి మన దేశంలో తొలిసారి మనుషులపై ప్రయోగ పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ బుధవారం వెల్లడించారు.

Published : 29 Feb 2024 04:28 IST

 కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ వెల్లడి

దిల్లీ: అధిక సమయం రక్తం గడ్డకట్టకుండా స్రవిస్తూ ఉండేలా పుట్టుకతో వచ్చే లోపాలను సరిచేసే జన్యు చికిత్సలకు సంబంధించి మన దేశంలో తొలిసారి మనుషులపై ప్రయోగ పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ బుధవారం వెల్లడించారు. వెల్లూరులోని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీలో వీటిని నిర్వహించామన్నారు. దీనికోసం లెంటివైరల్‌ వెక్టర్‌ అనే సరికొత్త సాంకేతికతను వినియోగించినట్లు తెలిపారు. అధిక రక్త స్రావానికి కారణమయ్యే రోగి మూల కణాల్లోకి అది ప్రవేశించి డీఎన్‌ఏను ప్రభావితం చేస్తుందని మంత్రి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని