ఆయుధాలు త్యజించి నిరసన

మణిపుర్‌లో మంగళవారం ఏఎస్పీని దుండగులు కిడ్నాప్‌ చేసినందుకు నిరసనగా పోలీస్‌ కమాండోలు బుధవారం ఆయుధాలను త్యజించారు.

Published : 29 Feb 2024 04:29 IST

 ఏఎస్పీ కిడ్నాప్‌పై మణిపుర్‌లో పోలీస్‌ కమాండోల ఆందోళన

ఇంఫాల్‌: మణిపుర్‌లో మంగళవారం ఏఎస్పీని దుండగులు కిడ్నాప్‌ చేసినందుకు నిరసనగా పోలీస్‌ కమాండోలు బుధవారం ఆయుధాలను త్యజించారు. ఇలాంటి దాడులు జరిగినప్పుడు వెంటనే ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇవ్వాలని డిమాండు చేశారు. ఇంఫాల్‌ లోయలోని 5 జిల్లాల కమాండోలు ఆయుధాలను త్యజించి నిరసన తెలిపారు. ఏఎస్పీని కిడ్నాప్‌ చేసిన మైతేయ్‌ అతివాద అరాంబే తెంగోల్‌ గ్రూపుపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని