గతేడాది 318 వాతావరణ సంబంధిత విపత్తులు

దేశంలో గతేడాది 318 వాతావరణ సంబంధిత విపత్తులు నమోదయ్యాయని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సంస్థ రూపొందించిన ‘స్టేట్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌-2024’ నివేదిక వెల్లడించింది.

Updated : 29 Feb 2024 05:39 IST

దిల్లీ: దేశంలో గతేడాది 318 వాతావరణ సంబంధిత విపత్తులు నమోదయ్యాయని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సంస్థ రూపొందించిన ‘స్టేట్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌-2024’ నివేదిక వెల్లడించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కనీసం ఒక్కరోజైనా ఇలాంటి విపత్తుల బారినపడ్డాయని వివరించింది. ఈ విపత్తుల కారణంగా 3,287 మంది మరణించారు. 1.24 లక్షల జంతువులు మృత్యువాత పడ్డాయి. 22.1 లక్షల హెక్టార్ల సాగుభూమి దెబ్బతింది. హిమాచల్‌ ప్రదేశ్‌లో అత్యధికంగా 149 రోజులు, మధ్యప్రదేశ్‌-141, కేరళ, ఉత్తర్‌ప్రదేశ్‌లలో 119 రోజులు విపత్తులు నమోదయ్యాయి. 100 రోజులకు పైగా విపత్తులు నమోదైన జాబితాలో ఎనిమిది రాష్ట్రాలున్నాయి. జూన్‌-సెప్టెంబరు మధ్య వరుసగా 123 రోజులు వాతావరణ సంబంధిత విపత్తులు నమోదయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని