భువనేశ్వర్‌లో బిల్‌గేట్స్‌ పర్యటన

మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ బుధవారం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో పర్యటించారు. విమానాశ్రయం నుంచి నేరుగా మంగళా అనే మురికివాడకు చేరుకుని అక్కడున్న కుటుంబాలతో ముచ్చటించారు.

Published : 29 Feb 2024 05:00 IST

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ బుధవారం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో పర్యటించారు. విమానాశ్రయం నుంచి నేరుగా మంగళా అనే మురికివాడకు చేరుకుని అక్కడున్న కుటుంబాలతో ముచ్చటించారు. వారి జీవన ప్రమాణాలు, పిల్లల చదువుల గురించి తెలుసుకున్నారు. ఇళ్లలోకి వెళ్లి మంచినీరు, విద్యుత్తు సరఫరా, మరుగుదొడ్లను పరిశీలించారు. అక్కడినుంచి స్వయం సహాయక సంఘాల ప్రధాన కార్యాలయం ‘మిషన్‌ శక్తి’ భవన్‌ను సందర్శించి ఉత్పత్తులు, విక్రయాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలపై ఆరా తీశారు. ఆ తరువాత బిల్‌గేట్స్‌ ఫౌండేషన్‌ ఆర్థిక సాయంతో ఏర్పాటుచేసిన కృషిభవన్‌ను సందర్శించారు. అనంతరం సీఎం నవీన్‌ పట్నాయక్‌ను కలిసి అరగంటపాటు మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని