ఒప్పంద ఉద్యోగినికీ ప్రసూతి సెలవులు

ప్రసూతి సెలవులు, ఇతర ప్రయోజనాలను పొందే హక్కు శాశ్వత (రెగ్యులర్‌) ఉద్యోగుల మాదిరిగా ఒప్పంద (కాంట్రాక్టు) సిబ్బందికీ ఉందనీ, ఉభయుల మధ్య తేడా చూపించకూడదని కలకత్తా హైకోర్టు తీర్పు చెప్పింది.

Published : 29 Feb 2024 05:04 IST

కోల్‌కతా: ప్రసూతి సెలవులు, ఇతర ప్రయోజనాలను పొందే హక్కు శాశ్వత (రెగ్యులర్‌) ఉద్యోగుల మాదిరిగా ఒప్పంద (కాంట్రాక్టు) సిబ్బందికీ ఉందనీ, ఉభయుల మధ్య తేడా చూపించకూడదని కలకత్తా హైకోర్టు తీర్పు చెప్పింది. ఎగ్జిక్యూటివ్‌ ఇంటర్న్‌గా పనిచేస్తున్న ఒక మహిళ పిటిషన్‌పై విచారణ చేపడుతూ.. ఆమెకు ప్రసూతి సౌకర్యాలు, పరిహారం అందించాలని సోమవారం రిజర్వు బ్యాంకును ఆదేశించింది. పిటిషనరు 2011 ఆగస్టు 16 నుంచి మూడేళ్లపాటు రిజర్వు బ్యాంకులో కాంట్రాక్టుపై ఎగ్జిక్యూటివ్‌ ఇంటర్న్‌గా పనిచేశారు. తాను గర్భవతినైన తరవాత వేతనంతో కూడిన 180 రోజుల మెటర్నిటీ సెలవులు ఇవ్వాల్సి ఉన్నా రిజర్వు బ్యాంకు నిరాకరించిందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని