జమ్మూకశ్మీర్‌లోని ముస్లిం కాన్ఫరెన్స్‌ వర్గాలపై కేంద్రం నిషేధం

దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతో పాటు పాకిస్థాన్‌ అనుకూల ప్రచారం చేస్తున్నాయనే అభియోగాలతో జమ్మూకశ్మీర్‌లోని ముస్లిం కాన్ఫరెన్స్‌కు చెందిన రెండు వర్గాల(అబ్దుల్‌ ఘని భట్‌, గులాం నబీ సుమ్జీ)పై కేంద్ర ప్రభుత్వం బుధవారం నిషేధం విధించింది.

Published : 29 Feb 2024 05:05 IST

దిల్లీ: దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతో పాటు పాకిస్థాన్‌ అనుకూల ప్రచారం చేస్తున్నాయనే అభియోగాలతో జమ్మూకశ్మీర్‌లోని ముస్లిం కాన్ఫరెన్స్‌కు చెందిన రెండు వర్గాల(అబ్దుల్‌ ఘని భట్‌, గులాం నబీ సుమ్జీ)పై కేంద్ర ప్రభుత్వం బుధవారం నిషేధం విధించింది. అయిదేళ్ల పాటు ఇది అమలులో ఉంటుంది. మితవాద హురియత్‌ కాన్ఫరెన్స్‌లోని భాగస్వామ్య పక్షంపై ఇటువంటి చర్య తీసుకోవడం ఇదే తొలిసారి. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులను కూకటి వేళ్లతో సహా పెకిలించివేయాలన్న దృఢ సంకల్పంతో ఉందని హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు. నిషేధానికి గురైన ముస్లిం కాన్ఫరెన్స్‌ వర్గాలు రెండూ...ఎన్నికల ప్రక్రియలో పాల్గొనవద్దని జమ్మూకశ్మీర్‌ ప్రజల్లో ప్రచారం చేస్తున్నాయని వెల్లడించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జమ్మూకశ్మీర్‌కే చెందిన జమాతే ఇస్లాం సంస్థపై ఉన్న నిషేధాన్ని కేంద్రం మంగళవారం మరో అయిదేళ్ల పాటు పొడిగించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని